జూలై 26 లోపు నేషనల్‌ అడ్రస్‌లో రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

- April 29, 2020 , by Maagulf
జూలై 26 లోపు నేషనల్‌ అడ్రస్‌లో రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

దోహా:లా 20, 2017 నేషనల్‌ అడ్రస్‌, అలాగే మినిస్టర్‌ ఆఫ్‌ ఇంటీరియర్‌ డిక్రీ 96, 2019 నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, పౌరులు అలాగే వలసదారులు, లీగల్‌ పర్సన్స్‌ ఇప్పటిదాకా ఎవరైతే నేషనల్‌ అడ్రస్‌ రిజిస్టర్‌ చేసుకోలేదో, వారంతా జూలై 26 లోపు రిజిస్ట్రేషన్‌ పూర్తి చెయ్యాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.  మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌కి చెందిన ‘మెట్రాష్‌2’ యాప్‌ ద్వారా మినిస్ట్రీ వెబ్‌సైట్‌(www.moi.gov.qa) ద్వారాగానీ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి వుంటుంది. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రమదాన్‌ నేపథ్యంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు అలాగే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో సర్వీస్‌ సెంటర్స్‌ అందుబాటులో వుంటాయి. రిజిస్టర్‌ చేసుకోనివారిపై ఆర్టికల్‌ 6 - నేషనల్‌ అడ్రస్‌ యాక్ట్‌ ప్రకారం చర్యలు తీసుకోబడ్తాయి. ఆర్టికల్‌ 3 అలాగే 4 ప్రకారం 10,000 కతారీ రియాల్స్‌ వరకూ జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుంది.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com