స్టాంప్డ్‌ వర్క్‌ వీసా ఫీజు రిఫండ్‌ చేయనున్న సౌదీ

- April 30, 2020 , by Maagulf
స్టాంప్డ్‌ వర్క్‌ వీసా ఫీజు రిఫండ్‌ చేయనున్న సౌదీ

రియాద్‌: సౌదీ అరేబియా, వర్క్‌ వీసా ఫీజుని రిఫండ్‌ చేసే ప్రక్రియను ప్రారంభించింది. స్టాంపింగ్‌(ముద్రణ) అయ్యాక కూడా కింగ్‌డమ్కి రాలేనివారి కోసం ఈ ప్రక్రియ చేపడుతున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడిన దరిమిలా సౌదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మినిస్ట్రీ ఆఫ్‌ హ్యామన్‌ రిసోర్సెస్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ - మినిస్ట్రీ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ సంయుక్తంగా దీనికి సంబంధించిన మెకానిజంని ప్రారంభించడం జరిగింది. మార్చి 18న విడుదల చేసిన రాయల్‌ డిక్రీ నేపథ్యంలో ఈ క్యాన్సిలేషన్‌ - రిఫండింగ్‌ అనేది పరిశీలనలోకి వచ్చింది. ప్రైవేట్‌ సెక్టార్‌లో పనిచేసేందుకోసం ప్రపంచంలోని పలు దేశాల్లోని సౌదీ డిప్లమాటిక్‌ మిషన్స్‌ వీసాలను జారీ చేయడం జరిగింది. అయితే, కరోనా వైరస్‌ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలు నిలిచిపోవడంతో వీసా రుసుములు రిఫండ్‌ చేయాలని సౌదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com