స్టే హోం రమదాన్: ఎమిరాతి బోట్ కెప్టెన్ కుటుంబం కథ ఇదీ!
- April 30, 2020
దుబాయ్:పవిత్ర రమదాన్ మాసంలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో పండగ వాతావరణం కనిపించేది. అయితే, ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల కారణంగా ‘గేదరింగ్స్’ కనిపించని పరిస్థితి.ఎమిరాతి బోట్ కెప్టెన్ సలీమ్ ఒబైద్ బిన్ సువైదీన్, ప్రతి యేటా రమదాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేవారు స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులతో. అయితే, ఈసారి పరిస్థితి అందుకు పూర్తి భిన్నం. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమవ్వాల్సి వస్తోంది. మసీదుల్లో సామూహిక ప్రార్థనలకు అవకాశం లేదు. ఇళ్ళలో బంధువులతో కలిసి చేసుకునే సంబరాలూ లేవు. అయినాగానీ, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిర్ణయాల్ని గౌరవించాలని సలెమ్ ఒబైద్ బిన్ సువైదాన్ తనయుడు చెప్పారు. మాస్కులలో ప్రార్థనల్ని మిస్ అవుతున్నామనీ, తరావీహ్ మరియు మఘ్రిబ్ ప్రార్థనలు చేయలేకపోతున్నామని అన్నారాయన. అయినప్పటికీ కూడా పదిమందికి సాయం చేసే క్రమంలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని ఒబైద్ కుటుంబం పేర్కొంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టేలా బయటకు వెళ్ళే పరిస్థితి అస్సలు లేదని ఒబైద్ కుమారులు చెప్పారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!







