కువైట్ః నేటితో ముగియనున్న క్షమాభిక్ష గడువు..
- April 30, 2020
కువైట్ఃసరైనా వీసా లేకుండా అక్రమంగా ఉంటున్న ప్రవాసీయులకు కువైట్ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్ష గడువు నేటితో ముగియనుంది. ఏప్రిల్ 30 నాటికి దేశం విడిచి వెళ్లాలని స్వచ్ఛదంగా ముందుకు వచ్చిన అక్రమ వలసదారులకు ఎలాంటి జరిమానా విధించకుండా స్వదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇస్తామని కువైట్ ప్రకటించిన విషయం తెలిసింది. అంతేకాదు..విమాన టికెట్లను కూడా ఉచితంగా అందిస్తామని తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా కువైట్ ఈ క్షమాభిక్ష అవకాశాన్ని కల్పించింది. అయితే..అక్రమ వలసదారుల్లో చాలా వరకు కువైట్ క్షమాభిక్ష అవకాశాన్ని వినియోగంచుకునేందుకు ముందుకు రావటం లేదు. ఇవాళ్టితో గడువు ముగుస్తున్నా..ఇప్పటివరకు కేవలం 25 వేల మంది మాత్రమే తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దేశంలో దాదాపు 1,60,000 మంది సరైనా వీసాలు లేకుండా అక్రమంగా నివసిస్తున్నారని కువైట్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందులో 1,35,000 మంది క్షమాభిక్ష అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఆసక్తి చూపటం లేదని, ఇంకా వారు దేశంలో దాగున్నారని అధికారులు చెబుతున్నారు. అయితే..క్షమాభిక్ష పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పొడగించే అవకాశమే లేదని కూడా అధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా వలసదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే నేటి సాయంత్రంలోగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇదిలాఉంటే..క్షమాభిక్ష పథకం కింద కొందరు వలసదారులు పేర్లు నమోదు చేసుకున్నా..ఆయా దేశాలు అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం తొలగించకపోవటంతో అక్రమవలసదారులు కువైట్ ఏర్పాటు చేసిన శిబిరాల్లోనే ఎదురుచూస్తున్నారు.
----దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!