భారత్:కరోనా మృతులు.. ఒక్కరోజులో 71 మంది..
- April 30, 2020
భారత్ దేశవ్యాప్తంగా ఉన్న కరోనా కేసుల్లో ఒక్క మహారాష్ట్రలోనే మరీ ఎక్కువగా ఉంటున్నాయి. నిన్న బుధవారం ఒక్కరోజే కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారిసంఖ్య 71గా నమోదు కాగా అందులో 32 మరణాలు మహారష్ట్రలో సంభవించినవే. మిగిలినవి గుజరాత్‌ో 16, మధ్యప్రదేశ్‌లో 6, యూపీలో ఐదుగురు మరణించారని కేంద్రం ప్రకటించింది. కాగా, దేశ వ్యాప్తంగా కరోనా మరణాల రేటు మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో ఉండగా, తరువాత మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీలో సంభవించాయి.
పశ్చిమ బెంగాల్‌లోని అలిపోర్ జిల్లా న్యాయస్థానంలో అధికారులను దించే కారు డ్రైవర్ తల్లి కోవిడ్ బారిన పడింది. దాంతో కేసుల విచారణను నిరవధికంగా వాయిదా వేసింది న్యాయస్థానం. ఢిల్లీ ఆధ్యాత్మిక సదస్సులో పాల్గొన్న బట్టల వ్యాపారి కుటుంబంలోని 8 మంది కరోనా సోకింది. పంజాబ్‌లో మే 17 వరకు లాక్‌డౌన్ పొడిగించారు. కేరళలో మాస్కులు ధరించడాన్ని తప్పని సరి చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.5 వేలు జరిమాన విధించనున్నట్లు ప్రకటించింది. లాక్‌డౌన్‌ను మే నెలాఖరు వరకు పొడిగించాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోరుతున్నారు.
తాజా వార్తలు
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!