హ్యామన్‌ రైట్స్‌ రిఫామ్స్ పట్ల హర్షం

- May 01, 2020 , by Maagulf
హ్యామన్‌ రైట్స్‌ రిఫామ్స్ పట్ల హర్షం

జెడ్డా: మైనర్లకు మరణ శిక్ష రద్దు చేస్తూ సౌదీ అరేబియా తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. ఇండిపెండెంట్‌ పర్మనెంట్‌ హ్యామన్‌ రైట్స్‌ కమిషన్‌ (ఐపిహెచ్‌ఆర్‌సి), ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కో-ఆపరేషన్‌ (ఓఐసి) వంటివి ఈ మేరకు హర్షం వ్యక్తం చేస్తూ ప్రకటనలు విడుదల చేశాయి. మైనర్లకు మరణ శిక్ష రద్దు చేయడం సహా, అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న సౌదీ ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నట్లు కమిషన్‌ పేర్కొంది. ఈ తరహా నిర్ణయాలతో సౌదీ అరేబియా ఖ్యాతి ప్రపంచ స్థాయిలో మరింత పెరుగుతుందని కమిషన్‌ అభిప్రాయపడింది. కింగ్‌ సల్మాన్‌, క్రౌన్‌ ప్రిన్స్‌ ముహమమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ తీసుకుంటున్న నిర్ణయాలు చారిత్రకమని కమిషన్‌ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com