ఆత్మహత్యాయత్నం: మహిళను రక్షించిన పోలీసులు

- May 01, 2020 , by Maagulf
ఆత్మహత్యాయత్నం: మహిళను రక్షించిన పోలీసులు

దుబాయ్:ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ఆత్మహత్యకు యత్నించగా, ఈ ఘటనలో పోలీసులు సదరు మహిళను రక్షించారు. అయితే, అప్పటికే ఆమె భర్త ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు ఆసియా జాతీయుడిగా పోలీసులు వెల్లడించారు. కాగా, తన కుమారుడు కన్పించడంలేదంటూ ఓ వ్యక్తి నైఫ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు సకాలంలో స్పందించారు. ఈ క్రమంలో ఓ మహిళను రక్షించగలిగారు. మానసిక సమస్యలతో తాము బాధపడుతున్నామనీ, ఈ క్రమంలోనే ఆత్మహత్యకు యత్నించినట్లు బాధితురాలు పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com