గాసిప్ వార్తల పై పోరాటంలో విజయ్ దేవరకొండ కు మద్దతుగా మహేష్ బాబు

- May 05, 2020 , by Maagulf
గాసిప్ వార్తల పై పోరాటంలో విజయ్ దేవరకొండ కు మద్దతుగా మహేష్ బాబు

కరోనా లాక్ డౌన్ సమయంలో అవసరంలో ఉన్న మధ్య తరగతి ప్రజల కోసం విజయ్ దేవరకొండ, దేవరకొండ ఫౌండేషన్ పేరు మీద సహాయ నిధి ఏర్పాటు చేసి సహాయం అందిస్తున్నారు. విజయ్ దేవరకొండ పై కొన్ని వెబ్ సైట్లు చేసిన నిరాధార ఆరోపణలను ఖండిస్తూ విజయ్ ఒక వీడియో ను విడుదల చేసారు. తమ స్వంత అజెండా తో ఆరోపణలు చేసే ఇలాంటి తప్పుడు వార్తలను, గాసిప్ వెబ్ సైట్లను నమ్మొద్దని, వాటికి దూరంగా ఉండాలని వీడియోలో తెలిపారు.విజయ్ దేవరకొండ పిలుపు కు స్పందించిన సూపర్ స్టార్ మహేష్, ఈ విషయంలో విజయ్ దేవరకొండ కు మద్దతు తెలుపుతూ తన సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఒక స్థాయికి చేరుకోవాలంటే ఎన్నో సంవత్సరాల కృషి, కష్టం, ఓర్పు, ఎన్నో త్యాగాలు ఉంటాయి. అంత కష్టపడితే కానీ ప్రజాభిమానం పొందలేము. భార్యకు బాధ్యత గల భర్తగా, పిల్లలకు స్ఫూర్తినిచ్చే ఒక సూపర్ హీరో వంటి తండ్రిగా, ఎంతగానో ప్రేమించే అభిమానులకు ఆదర్శవంతమైన సూపర్ స్టార్ గా బాధ్యత నిర్వర్తించాలంటే ఎంతో నిబద్ధతతో పని చేయాలి. 

ఎవరో పేరు కూడా తెలియని వ్యక్తి డబ్బు కోసం అగౌరవపరిచేలా, నిరాధార వార్తలు రాసి ఆ అబద్ధాలను వాటిని చదివే ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకోవడం ఎంత మాత్రం సమంజసం కాదు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీనీ, నా ఫ్యాన్స్ ను, నా పిల్లలను ఈ అబద్ధపు వార్తల నుండి కాపాడుకోవాలనుకుంటున్నాను. ఈ ఫేక్ వెబ్ సైట్ల మీద చర్యలు తీసుకోవాలని కలిసికట్టుగా వీటిని అరికట్టాలని, ఇందు కోసం అందరం ముందుకు రావాలని పిలుపునిస్తున్నాను.

మహేష్ మద్దతుకు విజయ్ దేవరకొండ కృతజ్ఞతలు తెలిపి మనమంతా ఒకటే... ఈ అసత్య వార్తలను ఎదుర్కునే టైమ్ వచ్చింది అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com