ఇండియాకు పయనం..పాటించాల్సిన ప్రొటోకాల్..
- May 05, 2020
గల్ఫ్: మే 7 నుండి ఇండియాకు పయనమవుతున్న ప్రవాసీయులకు ప్రభుత్వం పాటించనున్న ప్రొటోకాల్..
ప్రయాణీకులందరికీ బయలుదేరే విమానాశ్రయంలో మెడికల్ స్క్రీనింగ్ చేయటం జరుగుతుంది. సదరు వ్యక్తికి కరోనా లక్షణాలు లేవని ఆరోగ్య శాఖ అధికారులు ధృవీకరించిన తదుపరి మాత్రమే విమానంలో ఎక్కడానికి అనుమతించబడతారు. గమ్యం చేరుకున్న తదుపరి ప్రయాణీకులందరూ నిర్బంధానికి ఒప్పుకొని దానికి అయ్యే ఖర్చు భరిస్తామని ఒప్పందంపై సంతకం చేయవలసి ఉంటుంది. బోర్డింగ్ సమయంలో ప్రతి ప్రయాణీకుడికి రెండు ఫేస్ మాస్క్‌లు, 2 జతల గ్లౌజులు మరియు హ్యాండ్ శానిటైజర్ సీసాలు కలిగిన భద్రతా కిట్‌ను అందజేస్తారు.
విమానంలో ఉన్నప్పుడు, భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ యొక్క ఆరోగ్య ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించబడుతుంది. సిబ్బంది మరియు ప్రయాణీకులందరూ ముసుగులు ధరించి; శ్వాసకోశ పరిశుభ్రత, చేతి పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
గమ్యం చేరుకున్నప్పుడు, విమానాశ్రయంలో ఉన్న ఆరోగ్య అధికారులు ప్రయాణీకులందరికీ సంబంధించి హెల్త్ ప్రోటోకాల్ ప్రకారం థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తారు. స్క్రీనింగ్ సమయంలో రోగలక్షణంగా ఉన్న ప్రయాణీకులను ఆరోగ్య ప్రోటోకాల్ ప్రకారం వెంటనే వైద్య సదుపాయానికి తీసుకువెళతారు. మిగిలిన ప్రయాణీకులను ఏర్పాటు చేసిన నిర్బంధ సౌకర్యాలకు తీసుకువెళతారు. ప్రయాణీకులను కనీసం 14 రోజులు నిర్బంధంలో ఉండాలి. వారు 14 రోజుల తర్వాత మరలా పరీక్షలు నిర్వహించగా కరోనా లేదని నిర్ధారణ అయితేనే ఇంటికి వెళ్ళటానికి అనుమతించబడతారు లేదా ప్రోటోకాల్ ప్రకారం మరో 14 రోజులు వారి ఆరోగ్యంపై స్వీయ పర్యవేక్షణను చేపడతారు. మిగిలిన వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వం వైద్య సదుపాయానికి మారుస్తుంది.
తాజా వార్తలు
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!