12 ఏళ్ళ లోపు పిల్లలు, 60 ఏళ్ళ పైబడిన వారి పై నిషేధం
- May 06, 2020
దుబాయ్: మాల్స్, రిటెయిల్ షాప్స్ మరియు సూపర్ మార్కెట్లలోకి 12 ఏళ్ళ చిన్నారులు అలాగే 60 ఏళ్ళ పైబడిన వృద్ధులకు ప్రవేశాన్ని నిషేధిస్తూ యూఏఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ గ్రూపువారిలో తీవ్రత ఎక్కువగా వుండే అవకాశం వున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, యూఏఈలో ఇప్పటిదాకా 15,192 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 146 మంది మృత్యువాత పడ్డట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. పెద్దవారు, అందునా పలు రకాల ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నవారిపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. కాగా, ఏప్రిల్ 22 నుంచి యూఏఈలో మాల్స్ తెరుచుకున్నాయి. అయితే కొన్ని నిబంధనలు ఇంకా అమల్లోనే వున్నాయి. మార్చి 23న మాల్స్, షాపింగ్ సెంటర్స్, కమర్షియల్ సెంటర్స్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!







