కరోనా ఎఫెక్ట్ : ఎయిర్ అరేబియాలో 57 మంది ఉద్యోగుల తొలగింపు
- May 06, 2020
యూ.ఏ.ఈ:కరోనా దెబ్బతో ప్రపంచ దేశాలు ఆర్ధికంగా ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. ఆర్ధిక మాంద్యంతో పలు సంస్థలు, కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకునేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలను అణ్వేషిస్తున్నాయి. యూఏఈలోని ఏకైకా లిస్టెడ్ విమానయాన సంస్థ ఎయిర్ అరబియా కూడా అదే పంథాలో ముందుకు వెళ్తోంది. తమ సంస్థ నుంచి 57 మంది ఉద్యోగులను తొలగించింది. కరోనా వైరస్ కారణంగా సర్వీసులు నిలిపివేయటంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సంస్థ ప్రతినిధి తెలిపారు. తమ సంస్థ చరిత్రలోనే ఉద్యోగులను తొలగించటం ఇదే మొదటిసారి అని..ఇలాంటి నిర్ణయం తీసుకోవటం బాధకరమే అయినా..తప్పడం లేదని విచారం వ్యక్తం చేశారు. మరోవైపు 2000 మంది ఉన్న షార్జా బేస్డ్ ఎయిర్ లైన్స్ కూడా గత మార్చి నుంచి సేవలను నిలిపివేసింది. మళ్లీ ఎప్పుడు ప్రారంభించేది ఇంకా స్పష్టం చేయలేదు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?