ఊపందుకున్న 'వందేభారత్ మిషన్' తరలివెళ్తున్న ప్రయాణీకులు

- May 09, 2020 , by Maagulf
ఊపందుకున్న 'వందేభారత్ మిషన్' తరలివెళ్తున్న ప్రయాణీకులు

యూ.ఏ.ఈ:కరోనా వ్యాధి విస్తరించిన నేపథ్యంలో ఉద్యోగం కోల్పోయిన 200 మంది భారతీయులను శుక్రవారం పంపించగా.. మరింత మందిని శనివారం నాడు చెన్నైకు విమానం ద్వారా వారి స్వస్థలాలకు పంపారు. ముందుగా అనుకున్న ప్రకారం కాకుండా కొద్ది ఆలస్యం గా దాదాపు 360 మంది భారతీయులను వారి స్వస్థలాలకు పంపారు. విమానం IX  612 సుమారు 176 మందితో రాత్రి 8.07 నిమిషాలకు బయలుదేరగా, రెండో విమానం IX 540 దాదాపు 177 మంది ప్రయాణీకులతో రాత్రి 9 గంటలకు చెన్నై బయలుదేరింది. అందులో 36 మంది గర్భిణులు కాగా 47 మంది అనారోగ్యంతో బాధపడుతున్న వారు. దుబాయ్ లోని భారతీయ రాయబార కార్యాలయం పేర్కొన్నదాని ప్రకారం ప్రయాణీకుల్లో మిగిలిన వారు వయసు పైబడ్డవారితోపాటు సాధారణ యాత్రీకులు, వారి కుటుంబ సభ్యులు. ఈ ప్రత్యేక విమాన సౌకర్యం ఏర్పాటు నిరుద్యోగులకు, వైరస్ సోకుతుందని భయంతో ఉన్నవారికి ఒక అందివచ్చిన అదృష్టం గా పేర్కొనవచ్చు. ఇమ్మిగ్రేషన్ సంబంధించిన క్లియరెన్స్ లేని కారణంగా 4గురిని పంపలేదు. ఆరోగ్య సంబంధిత చికిత్స పొందుతున్న తన పేరు చెప్పడానికి ఇష్టం లేని ఒక డాక్టర్ మాట్లాడుతూ.. తనకు రొమ్ము కాన్సర్ ఉందనీ, చికిత్స భారత్ లో జరుగుతోందని తెలిపారు. మే 7 వ తేదీ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నివసిస్తున్న వ్యక్తులను స్వదేశానికి తీసుకెళ్లే కార్యక్రమం ప్రారంభించి ఇప్పటికి కోచి, కోజికోడ్ లకు 363 మందిని స్వదేశానికి తిరిగి పంపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com