షాపింగ్‌ అపాయింట్‌మెంట్స్‌ కొనసాగుతాయ్‌

- May 09, 2020 , by Maagulf
షాపింగ్‌ అపాయింట్‌మెంట్స్‌ కొనసాగుతాయ్‌

కువైట్: కాంప్రహెన్సివ్‌ కర్‌ఫ్యూ పీరియడ్‌ నేపథ్యంలో షాపింగ్‌ అపాయింట్‌మెంట్స్‌ విధానం కొనసాగుతుందని మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ పేర్కొంది. మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రతి ఒక్కరికీ వారంలో ఒక్క రోజు మాత్రమే అపాయింట్‌మెంట్‌ దొరుకుతుందని తెలుస్తోంది. ప్రభుత్వ అధికార ప్రతినిది¸ తారిక్‌ అల్‌ ముజార్రమ్ మాట్లాడుతూ, క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయం ప్రకారం, కాంప్రహెన్సివ్‌ కర్‌ఫ్యూని దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ వర్తింపజేస్తున్నారు. మే 10 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది. మే 30 వరకు ఇది పూర్తిగా అమల్లో వుంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com