ముసాఫా ప్రాంంలో స్టెరిలైజేషన్‌ మరియు టెస్టింగ్‌ క్యాంపెయిన్‌

- May 09, 2020 , by Maagulf
ముసాఫా ప్రాంంలో స్టెరిలైజేషన్‌ మరియు టెస్టింగ్‌ క్యాంపెయిన్‌

అబుధాబి హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌, ముసాఫా ప్రాంతంలో స్టెరిలైజేషన్‌ క్యాంపెయిన్‌ని ప్రారంభించబోతోంది. అలాగే రెసిడెంట్‌ వర్కర్స్‌ కోసం ఉచిత కోవిడ్‌19 పరీక్షలు కూడా నిర్వహిస్తారు. సంబంధిత అథారిటీస్‌ సాయంతో హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ కార్యక్రమాల్ని చేపట్టనుంది. ముసాఫా ప్రాంతంలో స్క్రీనింగ్‌ ప్రాసెస్‌ని వర్కర్స్‌ కోసం చేపడతారు. టెస్టింగ్‌ సెంటర్స్‌కి వెళ్ళేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పిస్తారు. రెసిడెన్సీ కండిషన్స్‌ని ఉల్లంఘించేవారికి ఈ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులూ కలగవు స్టెరిలైజేషన్‌ ప్రోగ్రామ్ సందర్భంగా. కరోనా వైరస్‌ పట్ల అవగాహన కల్పించేందుకు పలు భాషల్లో అవగాహనా కార్యక్రమాల్ని సైతం నిర్వహించనున్నారు. 

--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com