మాలే నుంది ఇండియాకు మరో నౌక
- May 09, 2020
సముద్ర సేతు కార్యక్రమంలో భాగంగా మాల్దీవుల నుండి కొచ్చి బయలుదేరడానికి సిద్ధంగా మరో భారత నావికాదళ ఓడ...
మాల్దీవులు: విదేశాలలో చిక్కుకున్న భారతీయులను తరలించడానికి భారత ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కార్యక్రమం 'సముద్ర సేతు'. ఈ కార్యక్రమంలో భాగంగా మాల్దీవుల నుండి రెండు నౌకలలో సుమారు వెయ్యి మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు నియమించారు. సముద్ర సేతు కార్యక్రమంలో భాగంగా మొదటి ఓడ ఐఎన్ఎస్ జల్ష్వా నిన్న సాయంత్రం 'మాలే' నుండి 19 మంది గర్భిణీ స్త్రీలు మరియు 14 మంది పిల్లలతో సహా 698 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఈ నౌక రేపు ఉదయం కొచ్చి చేరుకుంటుంది.
రెండవ నౌక ఐఎన్ఎస్ మాగర్ సుమారు 200 మంది ప్రయాణికులతో మాలే నుండి రేపు బయలుదేరనుంది. మాలేలోని భారత హైకమిషన్ ప్రయాణికుల తుది జాబితా ఖరారు చేయడంలో బిజీగా ఉంది. కొచ్చి లో ప్రయాణీకులను చేర్చిన అఞ్ఞతరం ఈ రెండు నౌకలు; ఐఎన్ఎస్ జలాష్వా మరియు ఐఎన్ఎస్ మాగర్ లు టుటికోరిన్ కు పయనమై అక్కడి ప్రవాసీయులను స్వదేశానికి చేర్చే కార్య్రక్రమాన్ని చేపట్టనున్నాయి. దీనికి సన్నాహాలు కూడా ప్రారంభమయ్యాయి అని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు