మరో పెళ్లి చేసుకున్న దిల్ రాజు
- May 11, 2020
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు రెండో వివాహం చేసుకున్న సందర్భంగా ఆయన కుమార్తె హన్షితా రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం రాత్రి 7.23 గంటలకు నిజామాబాద్‌లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తేజస్వినితో దిల్ రాజు పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా దిల్ రాజు కుమార్తె హన్షితా రెడ్డి తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో తండ్రి పెళ్లి ఫొటోను షేర్ చేశారు. 'మీరు ఎల్లప్పుడూ నాకు బలంగా ఉన్నారు.
నన్ను సంరక్షించడంతో పాటు ఎల్లప్పుడూ కుటుంబ సభ్యుల ఆనందానికే ప్రాధాన్యం ఇచ్చారు. మీకు ధన్యవాదాలు. జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన మీరిద్దరు సంతోషంగా, ప్రేమతో కలిసి ఉండాలని కోరుకుంటున్నా. ప్రతి రోజు మీకు ఓ అద్భుతమైన రోజు కావాలని ఆశిస్తున్నా. నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నా.. మీ హన్షు అని ఆమె పోస్ట్‌లో విషెస్ తెలిపారు.
దిల్ రాజు భార్య అనిత 2017లో అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆయన రెండో వివాహం చేసుకున్నారు. ట్విటర్లో దిల్ రాజుకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







