కువైట్:కిరాణా సరుకుల హోమ్ డెలివరికి అనుమతి..కర్ఫ్యూ నుంచి సడలింపు
- May 12, 2020
కువైట్:పూర్తిస్థాయి కర్ఫ్యూ అమలులోకి వచ్చిన కువైట్ లో నిత్యావసర సరుకుల సరఫరాకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు అధికారులు.రమదాన్ మాసం ప్రజలకు ఇబ్బంది లేకుండా కిరాణా సామాగ్రి కొనుగోలు చేసేలా కువైట్ మున్సిపాలిటీ కర్ఫ్యూ నుంచి సడలింపులు ఇచ్చింది. ఈ మేరకు కిరాణా స్టోర్స్ నిర్వాహకులు నేరుగా తమ వినియోగదారుల ఇళ్లకే సరుకులను సరఫరా చేసేలా హోమ్ డెలివరీ విధానానికి కువైట్ మున్సిపాలిటీ ఆమోదించింది. అయితే..హోమ్ డెలివరీ వినియోగదారులకు మాత్రమే వార్తిస్తుందని...ఇతర చిన్న వర్తకులకు సరుకులు పంపిణీ చేయటం కుదరదని మున్సిపాలిటీ అధికారులు చెబుతున్నారు. కువైట్ మంత్రి మండలి నిర్ణయానికి అనుగుణంగానే కర్ఫ్యూ సమయంలో సరుకుల హోమ్ డెలివరికి అనుమతి ఇచ్చామని వివరించారు. పగటి సమయంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, రాత్రివేళలో రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 1.30 వరకు కిరాణా సరుకులను హోమ్ డెలివరీ చేయవచ్చు. అయితే..హోమ్ డెలివరీ చేసే వ్యక్తులు ప్రజల ఆరోగ్యభద్రత దృష్ట్యా ఖచ్చితంగా ఫేస్ మాస్కులు, గ్లౌజులు ధరించాల్సిందేనని మున్సిపాలిటి అధికారులు సూచించారు. ఒకవేళ హోం డెలివరీకి సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే 65965744కి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







