ప్రవాసీయులతో TPCC చీఫ్ విడియో కాన్పెరెన్స్
- May 12, 2020
హైదరాబాద్:ప్రవాసీయులతో చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విడియో కాన్పెరెన్స్ ద్వారా ప్రపంచ నలుమూలలో ఉన్న తెలుగు సంఘాల ప్రముఖులతో చర్చంచిడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న అన్యాయం ప్రవాసీయులకు ముఖ్యంగా గల్ఫ్ కార్మీకులకు మరియు తెలంగాణ లో ఉన్న రైతులకు ఈ TRS ప్రభుత్వం చేస్తున్న అన్యయాన్ని అరికట్టాలని నలుమూలలో ఉన్న మన తెలంగాణ ప్రవాసీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కోరడం జరిగింది.ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ TRS ప్రభుత్వం ప్రజలకు సేవ చెయ్యడంలో పూర్తిగా విఫలమయ్యిందని ఆయన ఆగ్రహం మరియు ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పుట్టింది ప్రజల కోసం పని చేస్తుంది అని తెలిపారు. దేశం కోసం ఎయిర్ ఫోర్స్ కెప్టెన్ గా పని చేశాను.నా తెలంగాణ ప్రజల కోసం ఎప్పుడు నేను పోరాడతానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.దుబాయ్ నుండి యస్వీ రెడ్డి గల్ఫ్ కార్మీకుల అవస్తల గురించి వివరించారు.ఈ కరోనా మహామ్మారి వలన ఉద్యోగాలు పోయి జీతాలు లేక ఇంటికి రావడానికి టికెట్టుకు డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని మరియు చనిపోయిన మృత దేహాలను వాళ్ళ కుటుంబాలు చివరి చూపు చూసుకొనే అవకాశం కల్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరిస్తూ ఈ కోరోనా మహామ్మారి సమయంలో టిపిసిసి ఆధ్వర్యంలో కోవిడ్ - 19 టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారని మరియు ఇప్పటికే ఆరు సార్లు తెలంగాణ ప్రభుత్వానికి వినతి సమర్పించినట్టు తెలిపారు.ఈ రోజు గవర్నర్ కి కూడ వినతి సమర్పించనున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు DR. B.M వినోద్ కుమార్ TPCC vice president ,శ్యాం పిట్రోడా, మంహెందర్ సింగ్, రాజేశ్వర్ రెడ్డి ఐ.ఓ .సి TS president , ప్రదీప్ సామల, రాజశేఖర్ రెడ్డి ఆస్ట్రేలియా.దుబాయ్ నుండి యస్వి రెడ్డి(TPCC NRI సెల్ కన్వీనర్,దుబాయ్) మరియు ముఖ్యులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?