వందే భారత్ మిషన్ రెండో దశ షెడ్యూల్ విడుదల
- May 12, 2020
ఢిల్లీ:వందే భారత్ మిషన్ రెండో దశ షెడ్యూల్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకోని వచ్చేందుకు రెండో దశలో భాగంగా మే 16 నుంచి మే 22 వరకూ 149 విమానాలు నడపనున్నట్టు తెలిపింది. మొత్తం 31 దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి చేర్చనున్నారు. ఎయిర్ ఇండియా రెగ్యులర్ ఫ్లైట్స్ లేని కొన్ని దేశాలైన ఉక్రెయిన్, అర్మేనియా, కిర్జిస్తాన్, బెలారస్, జార్జియా, కజకస్తాన్, తజికిస్తాన్, నైజీరియా నుంచి కూడా భారతీయులను ఈ ప్రత్యేక విమానాల్లో తరలించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అమెరికా, యూఏఈ, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్, సింగపూర్, రష్యా దేశాలలో చిక్కుకున్న భారతీయులను కూడా ఈ దఫాలో భారత్‌కు చేర్చనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే వందే భారత్ మిషన్ తొలి దఫాలో భాగంగా 31 విమానాల్లో 6,037 మంది భారతీయులను స్వదేశానికి తరలించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







