మాస్క్ తప్పనిసరి.. ఉల్లంఘిస్తే 200,000 రియాల్జ్ వరకు జరీమానా
- May 14, 2020
దోహా:ప్రైమ్ మినిస్టర్ అలాగే ఇంటీరియర్ మినిస్టర్ షేక్ ఖాలిద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దుల్‌అజీజ్ అల్ థని నేతృత్వంలో క్యాబినెట్ రెగ్యులర్ మీటింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఈ మీటింగ్‌లో కీలక అంశాలపై చర్చ జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యల పట్ల క్యాబినెట్‌లో చర్చించారు. పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. వీటిల్లో ముఖ్యమైనవి..
1. పౌరులు అలాగే రెసిడెంట్స్ తప్పనిసరిగా ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు మాస్క్ ధరించాలి. ఓ కారులు ఒక్క వ్యక్తి మాత్రమే ప్రయాణిస్తున్నప్పుడు మాస్క్ అవసరం లేదు.
2. ఉల్లంఘనలకు భారీ జరీమానాలు విధిస్తారు. 200,000 రియాల్స్ వరకు జరీమానా విధించడంతోపాటుగా, 3 ఏళ్ళ వరకు జైలు శిక్ష విధించే అవకాశం వుంటుంది.
3. మే 17 నుంచి ఈ డెసిషన్ అమల్లోకి వస్తుంది.
కాగా, అల్ ఖర్సాహ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్‌కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్నారు. దీంతోపాటుగా, రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఖతార్ ఫైనాన్షియల్ సెంటర్‌కి సంబంధించిన యాక్టివిటీస్ రిపోర్ట్‌ని క్యాబినెట్ రివ్యూ చేసింది. మరికొన్ని కీలక నిర్ణయాల్ని కూడా ఈ సమావేశంలో తీసుకోవడం జరిగింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







