వాట్సాప్‌ బేస్డ్‌ సిస్టమ్స్ ని ప్రారంభించిన జస్టిస్‌ మినిస్ట్రీ

- May 14, 2020 , by Maagulf
వాట్సాప్‌ బేస్డ్‌ సిస్టమ్స్ ని ప్రారంభించిన జస్టిస్‌ మినిస్ట్రీ

మనామా:మినిస్ట్రీ ఆఫ్‌ జస్టిస్‌, ఇస్లామిక్‌ ఎఫైర్స్‌ అండ్‌ ఎండోవ్‌మెంట్స్‌, వాట్సాప్‌ బేస్డ్‌ అపాయింట్‌మెంట్‌ సిస్టమ్స్ ని డాక్యుమెంటేషన్‌ మరియు సర్టిఫికేషన్‌ కోసం ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. వ్యక్తిగతంగా అపాయింట్‌మెంట్‌ పొందే అవసరం లేకుండా ఈ విధానం ఉపకరిస్తుంది. వాట్సాప్‌ అప్లికేషన్‌ ద్వారా ఈ మేరకు రెండు నెంబర్లను మినిస్ట్రీ అందుబాటులోకి తెచ్చిందని మినిస్ట్రీకి చెందిన డాక్యుమెంటేషన్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ లుబ్నా అబ్దుల్‌అజీజ్‌ అల్‌ మౌసా చెప్పారు. ఫస్ట్‌ లైన్‌ అథెంటికేషన్‌ కోసం రెండోది రియల్‌ ఎస్టేట్‌ వెరిఫికేషన్‌ కోసం ఉపయోగించాల్సి వుంటుంది. అపాయింట్‌మెంట్‌కి సంబంధించి అప్లియెంట్స్‌కి నోటిఫై చేయబడుతుంది. ఆథెంటికేషన్‌ అపాయింట్‌మెంట్స్‌ కోసం డిటెయిల్స్‌ని 35436743కి అలాగే, రియల్‌ ఎస్టేట్‌ ఆథంటికేషన్స్‌ కోసం 35436744 నెంబర్‌కి తమ వివరాలు పంపాల్సి వుంటుంది.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com