దుబాయ్ లో ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ వాసి
- May 14, 2020
దుబాయ్:ఆత్మహత్య చేసుకుని మరణించిన గల్ఫన్న మృతదేహాన్ని స్వగ్రామానికి పంపేందుకు అండగా నిలిచిన గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC).
తెలంగాణ రాష్ట్రం, కామరెడ్డి జిల్లా, మాచారెడ్డి మండలం, ఎల్లంపేట్ గ్రామానికి చెందిన కాసాల నారా గౌడ్ (34) అనే కార్మికుడు పదకొండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుని మరణించడం జరిగింది.
ఈ విషయాన్ని దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవా సమితి ఉపాధ్యాక్షుడు బాలు బొమ్మిడి మరియు మాజీ అధ్యక్షుడు నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్ మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షుడు గుండెల్లి నరసింహ మరియు ఉపాధ్యాక్షుడు శేఖర్ గౌడ్ కు తెలపడంతో వెంటనే స్పందించి మృతుడి కంపని యాజమాన్యంతో మాట్లాడి అన్ని ఫార్మాలిటిస్ దగ్గరుండి పూర్తి చేయించి కంపెనీ పూర్తి సహకారంతో మృతదేహాన్ని ఈ రోజు ఇండియా పంపించడం జరిగింది. అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్టు నుండి వారి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడ కల్పించడం జరిగింది.
బాధిత కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అలాగే గల్ఫ్ కార్మికుల చిరకాల వాంఛ అయిన T NRI పాలసీని వెంటనే అమలు చేయాలని మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి నుండి డిమాండు చేస్తున్నాము. ఇంకా కూడ ఏవరైనా కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నట్లయితే మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) సంప్రదించవలసిందిగా కోరుతున్నాము.
ఈ కార్యక్రమంలో గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షులు గుండేల్లి నర్సింహా ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్, దొనకంటి శ్రీనివాస్, శరత్ గౌడ్, మునిందర్ దీకోండ,కట్ట రాజు,పవన్ కుమార్, కనకట్ల రవీందర్,షేక్ వల్లి, అశోక్ రెడ్డి, రాయిల్ల మల్లేశం, రఘు పేంట, ప్రవీణ్ చేర్యాల, నరేందర్ గౌడ్, సాన లక్ష్మణ్, మామిడిపల్లి వెంకటేశం, చింతల లక్ష్మణ్, పేనుకుల అశోక్, చిరుత నరేష్, గోవర్ధన్ యాదవ్, మనెళ్లి ప్రసాద్, కాసారపు భుమేష్, యువరాజు, జలపతి, అజయ్, హరిశ్, సాయి మరియు సభ్యులు బాగస్వాములు అయ్యారు.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







