బహ్రెయిన్:విజిటర్స్ కోసం షిషా ఏర్పాటు చేసిన పర్యాటక కేంద్రంపై చర్యలు
- May 15, 2020
మనామా:లాక్ డౌన్ నిబంధనల సడలింపును దుర్వినియోగం చేసుకుంటున్నారు కొందరు వ్యాపారులు. కరోనా ప్రమాదం పొంచి ఉన్నా..తమకు డబ్బు సంపాదించటమే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్నారు. అలాంటి ఓ పర్యాటక కేంద్రాన్ని పోలీసలు మూసివేయించారు. కరోనా నేపథ్యంలో షీషా కల్చర్‌కు అనుమతి లేకున్నా..వ్యాపారం కోసం పర్యాటకులకు షీషా ఏర్పాటు చేయటమే ఇందుకు కారణం. బహ్రెయిన్ లోని ముహర్రఖ్ గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పర్యాటక కేంద్రం నిర్వాహకులు అతిథుల కోసం షీషా ఏర్పాటు చేశారన్న సమాచారంతో పోలీసులు, పర్యాటక మంత్రిత్వ శాక అధికారులు, న్యాయ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. తమకు అందిన సమాచారం నిజమేనని నిర్ధారించుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా షీషాను బహ్రెయిన్ ప్రభుత్వం నిషేధం విధించారు. అయినా..నిబంధనలు పట్టించుకోకుండా షీషా కల్చర్ ను ఏర్పాటు చేయటంతో అధికారులు పర్యాటక కేంద్రాన్ని మూసివేయించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు