యూఏఈ:అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తే జరిమానాలు..
- May 15, 2020
యూఏఈ:పార్కింగ్ ఫీజుల నుంచి ప్రజలకు మినహాయింపులు ఇచ్చినా..అబుధాబి వాహనదారులు రోడ్లపై అడ్డదిడ్డంగానే వాహనాలను పార్క్ చేస్తున్నారు. పార్కింగ్ స్థలాల్లో ఓ పద్దతిగా పార్కింగ్ చేసే అవకాశాలు ఉన్నా..అవేం పట్టించుకోకుండా రోడ్ల పక్కనే వాహనాలను పార్క్ చేస్తూ తోటి వాహనదారులను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్ధిక ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న ప్రజలకు పార్కింగ్ ఫీజులను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఫీజులు రద్దు చేసినా..పార్కింగ్ సర్వీసులను వాహనదారులు దుర్వినియోగం చేస్తున్నారని అబుధాబి మున్సిపాలిటిలోని సమీకృత రవాణా కేంద్రం అధికారులు అంటున్నారు. ఇక నుంచి అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్కింగ్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానా విధిస్తామని తెలిపారు. నిషేధిత ప్రాంతంలో పార్క్ చేసినా, వాహనాల వెనక, ముందు భాగంలో కార్లను నిలిపినా, డబుల్ పార్కింగ్ చేసినా జరిమానా తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. నిర్ణీత పార్కింగ్ ప్రదేశాల్లో ఓ క్రమపద్దతిలో వాహనాలను పార్క్ చేసుకుంటే అందరికీ ఉపయుక్తంగా ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు