ఒమన్ లో భౌతిక దూరం పాటించకుండా గుమికూడిన వ్యక్తుల అరెస్ట్
- May 15, 2020
ఒమన్:కరోనా వ్యాప్తి నియంత్రణకు భౌతిక దూరం పాటించాలని అధికారులు ఎంతగా చెబుతున్నా..కొందరు జనాలు మాత్రం తీరు మార్చుకోవటం లేదు. ఒమన్ లోని నార్త్ అల్ షర్ఖియా ప్రాంతంలో కొంతమంది భౌతిక దూరం నిబంధనలు పాటించకుండా ఒకే చోట గుమికూడారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి..న్యాయ విచారణకు కేసును బదిలీ చేశారు. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా సుప్రీం కమిటీ పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు మినహా ఇతరులు ఎవరూ ఒకే చోట గుమికూడొద్దని నిబంధనలు విధించింది. అయినా..కొందరు జనం ఇష్టారీతిన వ్యవహరిస్తుండటంతో పోలీసులు అలాంటి వారికి కట్టడి చేసే పనిలో ఉన్నారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరు భౌతిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందేనని, లేకపోతే అరెస్టులు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?