మాల్‌ ఆఫ్‌ ది ఎమిరేట్స్‌ - డ్రైవ్‌ ఇన్‌ సినిమా

- May 15, 2020 , by Maagulf
మాల్‌ ఆఫ్‌ ది ఎమిరేట్స్‌ - డ్రైవ్‌ ఇన్‌ సినిమా

దుబాయ్:మాల్‌ ఆఫ్‌ ఎమిరేట్స్‌ వినూత్నమైన కాన్సెప్ట్‌తో సినీ ప్రియుల్ని అలరించనుంది. వోక్స్‌ సినిమాస్‌, సినీ ప్రియులకి అత్యద్భుతమైన అనుభూతిని అందించనుంది. సోషల్‌ డిస్టెన్సింగ్‌ నేపథ్యంలో ది¸యేటర్లకు సినీ ప్రేక్షకులు వెళ్ళి ఎంజాయ్‌ చేసే పరిస్థితుల్లేవు. ఈ నేపథ్యంలో ఓపెన్‌ ఎయిర్‌ ది¸యేటర్‌ తరహాలో ఏర్పాట్లు చేసింది వోక్స్‌ సినిమాస్‌. కార్లలో వెళ్ళి, కారు దిగకుండానే సినిమా చూసేందుకు అవకాశం కల్పిస్తోంది ఈ విధానం. 7.15 నిమిషాలకు ప్రారంభమయ్యే సినిమా కోసం కార్ల వద్దకే ఇఫ్తార్‌ మీల్స్‌ని కూడా అందిస్తారు. ప్రస్తుతానికి ఇన్వైట్‌ ఓన్లీ ఈవెంట్‌గా దీన్ని నిర్వహిస్తున్నారు. ముందు ముందు ఈ కొత్త అనుభూతిలో సినిమాల్ని వీక్షించేందుకోసం బుకింగ్‌ డిటెయిల్స్‌ని అనౌన్స్‌ చేయబోతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com