MFEలకు రూ. 10 వేల కోట్లు

- May 15, 2020 , by Maagulf
MFEలకు రూ. 10 వేల కోట్లు

ఢిల్లీ: స్థానిక వస్తువులకు అంతర్జాతీయ మార్కెట్‌ కల్పించాలన్న పీఎం మోదీ లక్ష్య సాధనకు అనుగుణంగా సూక్ష్మ ఆహార సంస్థలకు (మైక్రో ఫుడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌) రూ. 10 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ఈ ప్యాకేజీతో రెండు లక్షల మైక్రో ఫుడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు లబ్ధి చేకూరనుంది. దీని ద్వారా ప్రజల ఆరోగ్య మెరుగుదల, సురక్షిత ప్రమాణాలు అభివృద్ధి, రిటైల్‌ మార్కెట్ల అనుసంధానం, ఆర్థిక రాబడుల పెంపును లక్షిస్తున్నట్లు తెలిపింది. ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ మూడో విడత ప్యాకేజీని నిర్మలా సీతారామన్‌ నేడు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె ఎంఫ్‌ఈ లకు రూ. 10 వేల ప్యాకేజీని ప్రకటించారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రమాణాలను అందుకునేందుకు వీలుగా ఎంఎఫ్‌ఈలను సాంకేతికంగా అభివృద్ధి చేయడం. బ్రాండ్లు కల్పించి మార్కెట్‌ సదుపాయాలు కల్పించడం. సూక్ష్మ ఆహార సంస్థలు, రైతు ఉత్పత్తి సంస్థలు, స్వయం సహాయక సంఘాలకు మద్దతు కల్పించడం. ప్రాంతానికి అనుగుణంగా ఉత్పత్తులను ప్రోత్సహించడం వంటివి ఈ పథకం కింద చేపట్టనున్నట్లు తెలిపారు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో మామిడి, జమ్ముకశ్మీర్‌లో కేసర్‌, ఈశాన్యంలో వెదురు, ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి, తమిళనాడులో కర్రపెండలం వంటి వాటిని ప్రోత్సహించనున్నట్లు ఆమె ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com