MFEలకు రూ. 10 వేల కోట్లు
- May 15, 2020
ఢిల్లీ: స్థానిక వస్తువులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించాలన్న పీఎం మోదీ లక్ష్య సాధనకు అనుగుణంగా సూక్ష్మ ఆహార సంస్థలకు (మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్) రూ. 10 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ఈ ప్యాకేజీతో రెండు లక్షల మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్కు లబ్ధి చేకూరనుంది. దీని ద్వారా ప్రజల ఆరోగ్య మెరుగుదల, సురక్షిత ప్రమాణాలు అభివృద్ధి, రిటైల్ మార్కెట్ల అనుసంధానం, ఆర్థిక రాబడుల పెంపును లక్షిస్తున్నట్లు తెలిపింది. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ మూడో విడత ప్యాకేజీని నిర్మలా సీతారామన్ నేడు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె ఎంఫ్ఈ లకు రూ. 10 వేల ప్యాకేజీని ప్రకటించారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాలను అందుకునేందుకు వీలుగా ఎంఎఫ్ఈలను సాంకేతికంగా అభివృద్ధి చేయడం. బ్రాండ్లు కల్పించి మార్కెట్ సదుపాయాలు కల్పించడం. సూక్ష్మ ఆహార సంస్థలు, రైతు ఉత్పత్తి సంస్థలు, స్వయం సహాయక సంఘాలకు మద్దతు కల్పించడం. ప్రాంతానికి అనుగుణంగా ఉత్పత్తులను ప్రోత్సహించడం వంటివి ఈ పథకం కింద చేపట్టనున్నట్లు తెలిపారు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో మామిడి, జమ్ముకశ్మీర్లో కేసర్, ఈశాన్యంలో వెదురు, ఆంధ్రప్రదేశ్లో మిర్చి, తమిళనాడులో కర్రపెండలం వంటి వాటిని ప్రోత్సహించనున్నట్లు ఆమె ప్రకటించారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







