కువైట్:భారతీయుల తరలింపునకు బ్రేక్..ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు తాత్కాలిక నిలిపివేత
- May 15, 2020
కువైట్:కువైట్ లోని భారతీయులను స్వదేశాలకు తరలించేందుకు చేపట్టిన ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. ఈ మేరకు కువైట్ లోని భారతీయ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్ వెళ్లేందుకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో వాళ్లందరిని పంపించిన తర్వాత మళ్లీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే..ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ..అత్యవసరంగా వెళ్లాల్సిన వారు మాత్రం రాయబార కార్యాలయానికి ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మెడికల్ ఎమర్జెన్సీ, గర్భిణిలు, కుటుంబసభ్యుల అంత్యక్రియలకు సంబంధించి అత్యవసరంగా వెళ్లాల్సినవారు మాత్రమే [email protected] కు తమ దరఖాస్తులను మెయిల్ చేయాల్సి ఉంటుంది.
ఇదిలాఉంటే..దరఖాస్తుదారులకు విమాన ప్రయాణాన్ని నిర్ధారించే అధికారం పూర్తిగా రాయబార కార్యాలయానికే ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇతర ఏజెన్సీలను సంప్రదించి మోసపోవద్దని అధికారులు సూచించారు. అలాగే విమాన టికెట్ల కొనుగోలు వ్యవహారం అంతా ఎయిర్ ఇండియా చూసుకుంటుందని కూడా స్పష్టం చేశారు. టికెట్ల కొనుగోలుతో రాయబార కార్యాలయానికి సంబంధం లేదన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







