మే16 నుంచి స్వదేశానికి యూఏఈలోని భారతీయుల తరలింపు
- May 15, 2020
యూఏఈలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు రెండో దశ చర్యలు ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం.ఇందులో భాగంగా శనివారం నుంచి ప్రత్యేక విమాన సర్వీసులను నడపనుంది.శనివారం దుబాయ్,అబుధాబి నుంచి మొత్తం మూడు విమానాలు బయల్దేరనున్నాయి.ఓ ఫ్లైట్ దుబాయ్ నుంచి కొచ్చి,మరో రెండు విమానాలు అబుధాబి నుంచి తిరువనంతపురం, కోజికోడ్ వెళ్లనున్నాయి.కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమానసర్వీసులు రద్దైన కారణంగా పలు దేశాల్లో భారతీయులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.దీంతో భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం మే 7 నుంచి వందే భారత్ మిషన్ చేపట్టింది.ఇందులో భాగంగా తొలిదశలో గల్ఫ్ దేశాల్లోని భారతీయుల్లో కొందర్ని ఇప్పటికే ఇండియా తీసుకురాగా..మే 16 నుంచి రెండో దశ తరలింపు చర్యలు చేపట్టింది.ఈ నెల 23 వరకు రెండో దశ తరలింపు కొనసాగనున్నట్లు దుబాయ్ లోని ఇండియా కాన్సులేట్ కార్యాలయ అధికారులు ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)

తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







