తెలంగాణలో కొత్తగా 42 కరోనా కేసులు..
- May 15, 2020
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులన్నీ కూడా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 37 మందికి, రంగారెడ్డి జిల్లాలో ఇద్దరికి, ముగ్గురు వలస కూలీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకూ మొత్తం 1,551 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆదివారం 21 మంది డిశ్చార్జ్ అయ్యారు. వీరితో కలుపుకుని ఇప్పటివరకు మొత్తం 992 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా 57 మంది వలస కూలీలకు కరోనా పాజిటివ్ వచ్చింది. 525 మందికి చికిత్స కొనసాగుతోంది. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







