భారత్: 24 గంటల్లో 3970 కొత్త కరోనా పాజిటివ్ కేసులు...

- May 16, 2020 , by Maagulf
భారత్: 24 గంటల్లో 3970 కొత్త కరోనా పాజిటివ్ కేసులు...

కరోనా పాజిటివ్ కేసుల్లో భారత్... చైనాను వెనక్కు నెట్టింది. కొత్తగా 3970 పాజిటివ్ కేసులు రావడంతో... భారత్లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 85940కి చేరింది. చైనాలో ఈ సంఖ్య 82941గా ఉంది. భారత్లో తాజాగా 24 గంటల్లో 103 మంది చనిపోవడంతో... మొత్తం మృతుల సంఖ్య 2752కి చేరింది. ప్రస్తుతం భారత్లో... 30153 మంది కరోనా నుంచి రికవరీ అవ్వడంతో... భారత్లో ఇప్పుడు యాక్టివ్ కేసుల సంఖ్య 53035కి చేరింది. ప్రధానంగా... భారత్లో ఇప్పుడు.... మహారాష్ట్రలో 29100 పాజిటివ్ కేసులున్నాయి. అలాగే... తమిళనాడులో 10108, గుజరాత్‌లో 9931, ఢిల్లీలో 8895, మధ్యప్రదేశ్‌లో 4595, ఉత్తరప్రదేశ్‌లో 4057 కేసులున్నాయి. అంటే... ఇండియాలో 10వేల కేసులు దాటిన రాష్ట్రాలు రెండు ఉన్నట్లు తేలింది. రెండ్రోజుల్లో గుజరాత్, ఢిల్లీ కూడా 10 వేల మార్కును దాటేలా కనిపిస్తున్నాయి.

భారత్లో కేసుల సంఖ్య పెరిగిన సమయంలో... చైనాతో పోల్చి చూస్తే... ఆ దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 89గా ఉంది.భారత్లో అది 53వేలకు పైగా ఉంది. చైనాలో మరణాల సంఖ్య ప్రతి 10 లక్షల మందిలో 3గా ఉంటే... భారత్లో అది... 2గా ఉంది. ఇప్పటికైతే భారత్ మెరుగ్గా కనిపిస్తున్నా... దేశంలో కరోనా ఎక్కడి దాకా వెళ్తుందో అర్థం కావట్లేదు. చైనా ఒక్క వుహాన్ నగరానికే కరోనాను కంట్రోల్ చేయగలిగింది. మిగతా ప్రాంతాల్లో వైరస్ పెద్దగా వ్యాప్తి చెందలేదు. ఇండియాలో మాత్రం అన్ని రాష్ట్రాలకూ కరోనా పాకింది. అందువల్ల భారత్లో పెరుగుతున్న కేసులు ఇప్పట్లో ఆగే ఛాన్స్ లేదని అంటున్నారు.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com