ఒమన్:ప్రవాసీయులకు ఉచిత చికిత్సపై స్పష్టత ఇచ్చిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ
- May 16, 2020
మస్కట్:ఒమన్ లోని ప్రవాసీయులకు ప్రభుత్వం ఉచిత చికిత్స అందించనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఒమన్ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. బెంగాలీలో ఉన్న ఫేస్ బుక్ ఫేజీతో సహా పలు సామాజిక మాధ్యమాల్లో ఇటీవల ఉచిత చికిత్సపై అసత్య ప్రచారం జరుగుతోంది. ప్రవాసీయుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని అపోహలు సృష్టించేలా సోషల్ మీడియాలో కొందరు పోస్ట్ లు పెడుతున్నట్లు ఒమన్ ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఆరోగ్యమంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రవాసీయులకు అయ్యే వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందనే అంశాన్ని కొందరు తప్పుగా అర్ధం చేసుకున్నారని..ప్రభుత్వం వైద్య ఖర్చులను భరించబోదని స్పష్టం చేసింది. అయితే..ప్రవాసీయులకు స్పాన్సర్స్ ఉంటే..వారి వైద్య ఖర్చులన్నింటిని స్పాన్సర్స్ భరిస్తారని, అలాగే ప్రవాసీయులకు ఇన్సూరెన్స్ ఉంటే..ఇన్సూరెన్స్ కంపెనీలు ట్రీట్మెంట్ ఖర్చులను భరిస్తాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!







