కార్మికుల కోసం కేంద్రం కీలక నిర్ణయం:నిర్మలా సీతారామన్
- May 17, 2020
ఢిల్లీ: కార్మికుల కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మన్రెగా (మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) కోసం 40 వేల కోట్ల రూపాయల అదనపు నిధులను సమకూర్చింది. ఇది గతంలో కేటాయించిన నిధులకు అదనం. దీంతో మన్రెగాకు కేటయించిన మొత్తం నిధులు 61 వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. లాక్డౌన్ కారణంగా పనులు లేక సొంతూళ్ల బాట పట్టిన వలస కార్మికులకు తాజా కేటాయింపులు మేలు చేయనున్నాయి. మన్రెగా ప్రకారం కూలీలకు ఏడాదిలో 200 పనిరోజులుంటాయి. కూలీ కూడా గౌరవప్రదంగా ఉంటుంది. ప్రధాని ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ ప్రకారం వివిధ రంగాలకు కేటాయింపులను వెల్లడించేందుకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఐదోరోజు మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర ఆర్ధిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో కలిసి ఆమె వివరాలు వెల్లడించారు.
నిర్మాణరంగంలో ఉన్న కార్మికులను ఆదుకునేందుకు రూ.4వేల కోట్లు నేరుగా అందించామన్న నిర్మలా సీతారామన్ పేదలు, కూలీల ఆకలి తీర్చడం తమ బాధ్యతని ప్రకటించారు. ల్యాండ్, లేబర్, లిక్విడిటీ, లా తమ ప్రధానాంశాలని చెప్పారు. 8.1 కోట్ల మంది కార్మికులకు కిసాన్ యోజన కింద రూ.16,394కోట్ల నగదు కేటాయించామన్నారు. జన్‌ధన్ యోజన కింద రూ.10,025 కోట్లు నేరుగా ఖాతాల్లో జమ చేశామన్నారు. నిర్మాణ రంగ కార్మికులకు రూ.3,950కోట్లు కేటాయించినట్లు చెప్పారు. వలస కూలీల తరలింపులో 85శాతం ఖర్చును భరిస్తున్నట్లు తెలిపారు. 8.9కోట్ల మంది రైతులకు వారి ఖాతాల్లో రూ.2వేల చొప్పున పడ్డాయని చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు