వేసవి సెలవుల వరకు దూరవిద్య కార్యక్రమం పొడిగింపు
- May 17, 2020
మార్చి సంవత్సరంలో ప్రారంభమైన దూరవిద్య కార్యక్రమం వేసవి సెలవుల వరకు పొడిగించబడింది.
దుబాయ్: వేసవి సెలవుల తర్వాత సెప్టెంబర్‌లో పాఠశాలలు ప్రారంభించనున్నట్లు నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KHDA) తెలిపింది.
కరోనా అనిశ్చితి ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో తెలీని ఈ గందరగోళ పరిస్థితిలో KHDA ప్రభుత్వ అధికారులతో కలిసి ఈ నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు శిక్షణా సంస్థలు తమ విద్యార్థులతో పాఠ్యపుస్తకాలు మినహా ఎలాంటి కాగితపు వస్తువులను మార్పిడి చేయడానికి ప్రస్తుతం అనుమతించబడలేదని అధికారం నొక్కి చెప్పింది.
దూరవిద్య కార్యక్రమం ఎటువంటి అంతరాయం లేకుండా సాగేందుకు ప్రస్తుతం అనుసరిస్తున్న ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సాధనాలతో పాటు, ప్రత్యామ్నాయ వ్యూహాలను మరియు ఆన్‌లైన్ అభ్యాస పద్ధతులను చేర్చాలని ఉపాధ్యాయులకు KHDA సూచించింది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







