బహ్రెయిన్:క్షమాభిక్ష పొందిన 127 మంది భారతీయులను..స్వదేశానికి తరలింపు
- May 19, 2020
బహ్రెయిన్ ప్రభుత్వం నుంచి క్షమాభిక్ష పొందిన వారిలో 127 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. బహ్రెయిన్ నుంచి గల్ఫ్ ఎయిర్ ప్రత్యేక విమానంలో వారిని కొచ్చికి చేరుకున్నారు. ఇందులో 56 మంది కేరళవాసులు కూడా ఉన్నారు. రెండు దేశాల పరస్పర సహకారంతో పాటు కరోనా నేపథ్యంలో 901 మంది భారతీయులకు బహ్రెయిన్ ప్రభుత్వం గత మార్చిలో క్షమాభిక్ష ప్రసాదించిన విషయం తెలిసిందే. మరోవైపు కొచ్చి చేరుకున్న వారి ఇండియన్లను అక్కడి అధికారులు స్థానిక నావల్ ఎయిర్మెన్ స్కూల్ లో నిర్బంధంలో ఉంచారు. అందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన తర్వాత ఇంటికి పంపించనున్నారు. జరిమానాలు కూడా చెల్లించలేక జైలులో మగ్గుతున్న ఇండియన్లకు క్షమాభిక్ష ప్రసాదించిన బహ్రెయిన్ ప్రభుత్వానికి..భారత రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. గత ఏడాది ఆగస్టులో భారత ప్రధాని నరేంద్ర మోదీ బహ్రెయిన్ లో పర్యటించిన తర్వాత ఇరు దేశాల మైత్రి బంధం మరింత బలపడిందని...పరస్పర సహకారం మరింత
మెరుగ్గా ఉందని బహ్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం వివరించింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు