ఒమన్:ఈద్ సంబరాలపై నిషేధం విధించిన సుప్రీం కమిటీ
- May 19, 2020
మస్కట్:ఈద్ సంబరాలపై ఒమన్ సుప్రీం కమిటి నిషేధం విధించింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించి సమూహంగా సంబరాలు చేసుకున్నా..ఫేస్ మాస్కులు ధరించకపోయినా తగిన శిక్షలతో పాటు జరిమానా విధిస్తామని రాయల్ ఒమన్ పోలీసులు హెచ్చరించారు. సుప్రీం కమిటి నిర్ణయం మేరకు రంజాన్ సందర్భంగా సామూహిక ప్రార్ధనలు, సామూహిక సంబరాలు నిర్వహించకూడదు. అలాగే పరస్పరం ఈద్ శుభాకాంక్షలు తెలుపుతూ ఆలింగనం చేసుకోవటంపై కూడా నిషేధం అమలులో ఉంటుంది. సుప్రీం కమిటీ నిర్ణయాలను అమలు చేసేందుకు వ్యక్తులు, పబ్లిక్, ప్రైవేట్ సంస్థలలో అమలు చేసేలా రాయల్ ఒమన్ పోలీసులు ప్రతిక్షణం పర్యవేక్షిస్తూనే ఉంటారు. అంతేకాకుండా ఉల్లంఘించిన వారిని అదుపులోకి తీసుకొని వారికి జరిమానా విధించే అధికారం కూడా సుప్రీం కమిటీ రాయల్ ఒమన్ పోలీసులకు అప్పగించింది. ఇదిలాఉంటే పరిశ్రమలు, వాణిజ్య కేంద్రాలకు లాక్ డౌన్ నుంచి సడలింపు ఇచ్చే అవకాశాలు ఉండటంతో సుప్రీం కమిటీ నిర్ణయాలను కఠినంగా అమలు చేయనున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు