కరోనా వైరస్‌: నిబంధనల్ని ఉల్లంఘించిన గ్రూప్‌ అరెస్ట్‌

- May 19, 2020 , by Maagulf
కరోనా వైరస్‌: నిబంధనల్ని ఉల్లంఘించిన గ్రూప్‌ అరెస్ట్‌

మస్కట్‌: అల్‌ బతినా నార్త్‌ గవర్నరేట్‌లో పోలీసులు కొంతమంది వ్యక్తుల్ని అరెస్ట్‌ చేశారు. వీరంతా ఓ గ్రూప్‌గా ఏర్పడి, ఓ చోట సమావేశమయ్యారు. నిబంధనల్ని ఉల్లంఘించి గ్రూప్‌గా ఏర్పాటయ్యారనీ, అందుకే వీరిని అరెస్ట్‌ చేయడం జరిగిందని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఎక్కువమంది వ్యక్తులు ఒక చోట గుమికూడటం నేరం. ఈ మేరకు సుప్రీం కమిటీ గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అరెస్ట్‌ చేసినవారిని చట్ట పరమైన చర్యల నిమిత్తం సంబంధిత అథారిటీస్‌కి అప్పగించడం జరిగింది. ప్రతి ఒక్కరూ నిబంధనల్ని పాటించాలని ఈ సందర్భంగా రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com