తెలంగాణ: కొత్తగా 42 కరోనా పాజిటివ్‌ కేసులు

- May 19, 2020 , by Maagulf
తెలంగాణ: కొత్తగా 42  కరోనా పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. మంగళవారం మరో 42 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో GHMC పరిధిలోనే 34 కేసులు నమోదయ్యాయి. మరో 8 మంది వలస కూలీలకు కరోనా సోకినట్లు తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,634కు చేరింది. అందులో 77 మంది వలసదారులే ఉన్నారు. మంగళవారం 9 మంది కోలుకోగా, వారితో కలిపి 1011 మంది డిశ్చార్జి అయ్యారు. ఇవాళ 4 కరోనా మరణాలు నమోదవ్వగా మొత్తంగా ఇప్పటి వరకు 38 మంది చనిపోయారు. ప్రస్తుతం 585 మంది చికిత్స పొందుతున్నారు.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com