కరోనా నిబంధనల ఉల్లంఘన: నలుగురు వ్యక్తులకు జరీమానా

- May 20, 2020 , by Maagulf
కరోనా నిబంధనల ఉల్లంఘన: నలుగురు వ్యక్తులకు జరీమానా

మనామా: లోవర్‌ క్రిమినల్‌ కోర్టు, ఓ కమర్షియల్‌ ఔట్‌లెట్‌ ఓనర్‌కి 1000 బహ్రెయినీ దినార్స్‌ జరీమానా విధించింది. వినియోగదారులు సోషల్‌ డిస్టెన్సింగ్‌ పాటించేలా చూడకపోవడం, వారి టెంపరేచర్‌ని గుర్తించకపోవడం, శానిటైజేషన్‌కి సంబంధించిన లోపాలు, ట్రాలీల స్టెరిలైజేషన్‌ చేయకపోవడం వంటి అభియోగాలు కమర్షియల్‌ ఔట్‌లెట్‌ ఓనర్‌పై మోపబడ్డాయి. ఇదిలా వుంటే, నలుగురు వ్యక్తులు హోం క్వారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘించిన దరిమిలా వారికి కూడా 1000 బహ్రెయినీ దినార్స్‌ జరీమానా విధించింది న్యాయస్థానం. హోం కన్‌ఫైన్‌మెంట్‌కి కట్టుబడి వుండని 19 మంది వ్యక్తులపై పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టరేట్‌ సీరియస్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో నిందితులపై విచారణకు ప్రాసిక్యూషన్‌ సిద్ధమయ్యింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com