కోవిడ్ 19 ఎఫెక్ట్:ఈద్ రోజున కూడా మసీదుల మూసివేత..ప్రకటించిన యూఏఈ
- May 21, 2020
యూఏఈ:పండగలు, ప్రార్థనలపై కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతోంది. జనసమూహంతో వ్యాధి వ్యాప్తి చెందే అవకాశాలు ఉండటంతో ఇప్పటికే మసీదుల్లో ప్రార్ధనలను యూఏఈ నిషేధించింది. కనీసం రమదాన్ రోజునైనా మసీదుల్లో ప్రార్ధనలు నిర్వహించుకోవాలనుకున్న భక్తులకు మళ్లీ నిరాశే ఎదురైంది. కరోనా ఇంకా కంట్రోల్ కాపోవటంతో ఈద్ అల్ ఫితర్ రోజున కూడా మసీదులను మూసివేయనున్నట్లు యూఏఈ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అయితే..ఈద్ రోజున నిర్వహించే ప్రత్యేక ప్రార్ధనలకు ముందు జపించే తక్బీర్ ను...ప్రార్ధనకు పది నిమిషాల ముందు మసీదుల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తామని వెల్లడించింది. అందుకు అనుగుణంగా భక్తులు ప్రార్ధనలు నిర్వహించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు రమదాన్ భక్తి శ్రద్ధలతో, సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కూడా ఆరోగ్య శాఖ కోరింది. తమ ఆప్తులను సోషల్ మీడియా ద్వారా పలకరించుకోవాలని సూచించింది. ఇదిలాఉంటే..కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు యూఏఈ చేపడుతున్న రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని కూడా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు, ప్రవాసీయులు అంతా అల్ హోస్న్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలని సూచించారు.
కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తులు మీ సమీపంలో ఉంటే హెచ్చరించేలా యాప్ దోహదపడుతుందన్నారు. ఇప్పటికే 50 నుంచి 70 శాతం ప్రజలు యాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు