నిర్మాత రాజశేఖర్ రెడ్డి 11 లక్షలు సాయం..
- May 21, 2020
హైదరాబాద్:వలస కార్మికులు ఎంతోమంది పొట్ట చేత పట్టుకుని తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి వల్ల ఎంతోమంది వారి ఉపాధి కోల్పోయి సొంత ఊళ్ల బాట పట్టారు. అలాంటి వారిలో కొంతమందికైనా సాయం చేసే ఉద్ధేశ్యంలో ‘త్రిపుర’ చిత్ర నిర్మాత రాజశేఖర్ ముందుకొచ్చి తన వంతు సాయాన్ని అందించారు. వలస కార్మికులు కాలినడకన, లారీల్లో ఎలా అవకాశముంటే అలా వారి ప్రాంతాలకు వెళుతున్నారు. అలా వెళ్లే వాళ్లను చూసిన నిర్మాత యం.రాజశేఖర్ రెడ్డి ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. వాళ్లకు ఎంతో కొంత ఆసరాగా ఉండే ఉద్దేశ్యంతో సోమవారం ఒరిస్సా, చత్తీస్‌గడ్ వెళ్లేవారికోసం 400 ప్యాకెట్ల పులిహోర, బిస్కట్స్, మంచినీళ్లు, చెప్పులు, మెడిసిన్ అందచేశారు. మంగళ, బుధవారాల్లో ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర వెళ్లే వారికోసం దాదాపు 600 టమాట రైస్ తయారు చేయించారు, సొంత ఊళ్లు వెళ్లటానికి చార్జీలకు డబ్బులు లేనివారికి 40000 రూపాయలను ఇచ్చి ఆదుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో తెలంగాణ సీయం రిలీఫ్ ఫండ్‌కు 5లక్షలు, సీయం రిలీఫ్ ఫండ్‌కు 5లక్షలు అందించిన రాజశేఖర్ వలస కార్మికుల కోసం మరో లక్ష రూపాయాలను ఖర్చు చేసి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ప్రస్తుతం ఆయన ‘కేరాఫ్ కంచెరపాలెం’ను తమిళంలో ‘కేరాఫ్ కాదల్’గా తీశారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఆది పినిశెట్టి హీరోగా ‘క్లాప్’ చిత్రాన్ని తమిళ్, తెలగులో నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







