దుబాయ్:కోవిడ్ తర్వాత మళ్లీ అతిథులకు స్వాగతం పలుకుతున్న హబ్టూర్‌ గ్రాండ్‌ రిసార్ట్

- May 21, 2020 , by Maagulf
దుబాయ్:కోవిడ్ తర్వాత మళ్లీ అతిథులకు స్వాగతం పలుకుతున్న హబ్టూర్‌ గ్రాండ్‌ రిసార్ట్

‌దుబాయ్:కోవిడ్‌ దెబ్బకు హోటళ్లు, వాణిజ్య కేంద్రాలు అన్నింటికి మూతపడింది. ప్రపంచమంతా బోసిపోయింది. లాక్‌ డౌన్ సడలింపులతో ఇప్పుడిప్పుడే మళ్లీ మెల్లిగా తేరుకుంటోంది. దుబాయ్‌ లో అతి పురాతనమైన హోటల్ హబ్టూర్ గ్రాండ్ రిసార్ట్‌ కూడా ఎట్టకేలకు ఓపెన్‌ అవుతోంది. దుబాయ్‌ ఆతిథ్య హోటల్స్‌ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఆర్జించిన హబ్టూర్‌ గ్రాండ్ రిసార్ట్‌ ఇవాళ్టి నుంచి అతిథులకు స్వాగతం పలుకుతోంది. కరోనా సంక్షోభం తర్వాత దుబాయ్‌ లో తెరుచుకున్న తొలి హోటల్‌ ఇదే కావటం విశేషం.

కరోనా సంక్షోభం తర్వాత మళ్లీ ప్రారంభం అవుతున్న హబ్టూర్‌ గ్రాండ్ రిసార్ట్...లగ్జరీ సూట్స్‌,  విశాలమైన రెస్టారెంట్లు, ప్రైవేట్‌ బీచ్‌ లతో అతిథులకు పసందైన ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఆతిథులను ఆకర్షించేందుకు కొన్ని ఆఫర్లను కూడా ప్రకటించింది. అలాగే కరోనా వ్యాప్తి ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా హోటల్‌ సామర్ధ్యంలో 30 శాతానికి మించి అతిథులకు అనుమతి లేదని కూడా స్పష్టం చేసింది. ప్రస్తుతం హోటల్‌ లో 104 రిసోర్ట్ రూమ్స్‌ ఉన్నాయి. ఇదిలాఉంటే..అతిథుల ఆరోగ్య భద్రతకు తాము అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. హోటల్‌ కు వచ్చే వాళ్లందరికీ శానిటైజ్‌ చేసుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే హోటల్స్‌, బీచ్‌ లలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com