ఏ.పి లో కొత్తగా 45 కోవిడ్-19 పాజిటివ్ కేసులు
- May 21, 2020
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్-19 వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 8,092 మంది నమూనాలు పరీక్షించగా 45 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,452కి చేరింది. కరోనాతో ఇవాళ నెల్లూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 54కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకున్న 1689 మందిని డిశ్చార్జి చేశారు. వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 718 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో కోయంబేడు కాంటాక్ట్ కేసులు నాలుగు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్‌లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్‌జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు







