దుబాయ్:లాక్ డౌన్ నిబంధనల అమలుకు 500 గస్తీ బృందాలు,63 తనిఖీ కేంద్రాల ఏర్పాటు

- May 22, 2020 , by Maagulf
దుబాయ్:లాక్ డౌన్ నిబంధనల అమలుకు 500 గస్తీ బృందాలు,63 తనిఖీ కేంద్రాల ఏర్పాటు

దుబాయ్:ఈద్ అల్ ఫితర్ సమయంలో కోవిడ్ 19 ప్రోటోకాల్ అమలుకు దుబాయ్ పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో గవర్నరేట్ పరిధిలో దాదాపు 500 గస్తీ బృందాలను ఏర్పాటు చేసినట్లు దుబాయ్ పోలీస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అబ్ధుల్లా ఖలిఫా అల్ మెర్రి తెలిపారు. నిబంధనల ఉల్లంఘించే వారిని పసిగట్టేందుకు గస్తీ బృందాలకు రాడార్లు, కెమెరాల వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నట్లు వెల్లడించారు. నిబంధనలు పాటించని వారికి వందకు వంద శాతం జరిమానాలు విధిస్తామని..నిబంధనల అమలులో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. అలాగే గవర్నరేట్ పోలీసులు ఈద్ అల్ ఫితర్ సందర్భంగా అధికారులకు అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. గవర్నరేట్ పరిధిలోని దాదాపు 46 వలస కార్మికుల శిబిరాల్లో 7 మిలియన్ల ఆహార పొట్లాలను అందించటంలో అధికారులకు సహాయపడిందని ఈ సందర్భంగా దుబాయ్ పోలీస్ చీఫ్ వెల్లడించారు. యూఏఈలోని ప్రవాసీయులకు కూడా తమ దేశంలో అన్ని హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయన్నారు. ప్రవాస కార్మికులకు అన్ని రకాల వైద్య సాయం అందుబాటులో ఉంటుందన్నారు. ఈద్ అల్ ఫితర్ ను ప్రజలంతా సుఖ సంతోషాలతో జరుపుకోవాలన్నారు. అదే సమయంలో కరోనాపై విజయానికి భౌతిక దూరం పాటించి యూఏఈ సమాజం ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలబడాలని పిలుపునిచ్చారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com