భారత్ లో పెరిగిన కరోనా కేసులు
- May 23, 2020
భారత దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లోనే 6500 లకు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం... గడిచిన 24 గంటల్లో 6,654 మందికి కొత్తగా కరోనా సోకిందని వెల్లడించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,25,101 మంది కరోనా బారిన పడ్డారు. గడిచిన 24 గంటల్లోనే 137 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 3,720కి చేరింది. 51,784 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 69,597 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో క్యూర్ అయిన కేసులు 41.3 శాతం ఉండగా... మరణాల శాతం 2.97గా ఉంది.. ప్రస్తుతం యాక్టీవ్ కేసులు 55.6 శాతంగా ఉన్నాయి.
తాజా వార్తలు
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్‌తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ
- లోక్ భవన్లో ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ ఆవిర్భావ దినోత్సవం
- వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
- స్పేస్‌కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!







