తెలంగాణ:మరో 62 కరోనా కేసులు నమోదు

తెలంగాణ:మరో 62 కరోనా కేసులు నమోదు

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం 62 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు చనిపోయారు. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1761కి చేరగా.. మరణాలు 48కి చేరాయి.తాజాగా నమోదైన కేసుల్లో GHMC పరిధిలో 42 మంది, రంగారెడ్డిలో ఒక కేసు నమోదు అవ్వగా.. వలసదారులు 19 మంది ఉన్నారు. మొత్తం 118 మంది వలసకార్మికులకు కరోనా సోకింది. ఇవాళ ఒక్కరోజే ఏడుగురు డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్లినవారి సంఖ్య 1,043కి చేరుకుంది. ఆసుపత్రిలో 670 మంది చికిత్స పొందుతున్నారని హెల్త్ బులెటిన్‌లో ఆరోగ్య శాఖ తెలిపింది. ​ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌బులిటెన్‌ విడుదల చేసింది.

Back to Top