సౌదీ వ్యాప్తంగా పూర్తిస్థాయి కర్ఫ్యూ అమల్లోకి
- May 23, 2020
రియాద్:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తలాల్ అల్ షల్హౌబ్, సౌదీ అరేబియా వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి పూర్తిస్థాయి కర్ఫ్యూ అమల్లోకి వచ్చిందని చెప్పారు. మే 27వ తేదీ వరకూ ఈ పూర్తిస్థాయి కర్ఫ్యూ అమల్లో వుంటుంది. రోజులో 24 గంటలూ కర్ఫ్యూ అమల్లో వుంటుందని తలాల్ పేర్కొన్నారు. సెక్యూరిటీ ఫోర్సెస్, పూర్తిస్థాయిలో కర్ఫ్యూని అమలు చేస్తున్నట్లు చెప్పారాయన. ఎక్కడా ఎలాంటి ఉల్లంఘనలు జరగకుండా సెక్యూరిటీ ఫోర్సెస్ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో 999 నెంబర్‌కి ఫోన్ చేయొచ్చని తలాల్ సూచించారు. మక్కా రీజియన్లోనివారు 911 నెంబర్‌కి ఫోన్ చేయాల్సి వుంటుంది. సొంత డెలివరీ వాహనాల ద్వారా రెస్టిరెంట్స్ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సేవలు అందించవచ్చునని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







