భారత్ లో పెరుగుతున్నకరోనా కేసులు..
- May 24, 2020
భారత్‌లో కరోనా రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతుంది. గడిచిన 24 గంటల్లో 6767 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,31,868కు చేరిందని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. అటు, గడిచిన 24 గంటల్లో 2,657 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకూ డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 54,440 చేరింది. మరోవైపు ఒక్కరోజులో దేశవ్యాప్తంగా147 కరోనా మరణాలు సంభవించగా.. ఇప్పటివరకూ మొత్తం 3867 మంది చనిపోయారు. ప్రస్తుతానికి దేశంలో 73,560 మంది కరోనా బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవ్వడంతో అధికారిక వర్గాల్లో ఆందోళన మొదలైంది. దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపుతుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!
- ఒమాన్-సౌదీ 'విండ్స్ ఆఫ్ పీస్ 2026' ప్రారంభం..!!
- BHD–INR @244: భారతీయులకు ప్రయోజనం..!!
- రియాద్ లో కుప్పకూలిన స్ట్రీట్..!!
- కేపిటల్ గవర్నరేట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ తరలింపు..!!
- యూఏఈ-ఇండియా రూట్లో ఫ్లైట్స్ కొరత..హై ఫెయిర్స్..!!
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం







