భారత్:గత నాలుగు రోజులుగా పెరుగుతున్న కేసుల సంఖ్య
- May 25, 2020
లాక్డౌన్ విధించి కరోనా కేసుల్ని కట్టడి చేయగలిగిన భారత్.. ఈ నెలాఖరు వరకు లాక్డౌన్ ఉన్నా సడలింపుల్లో భాగంగా వేల సంఖ్యలో జనం రోడ్ల మీదకు వస్తున్నారు. దాంతో గత నాలుగు రోజులుగా భారత దేశంలో రోజుకి 6 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 6977 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో ఈ స్థాయిలో నమోదు కావడం ఇదే మొదటి సారి. దీంతో దేశంలో కరోన బాధితుల సంఖ్య 1,38,845కి చేరుకుంది. నిన్నఒక్కరోజే కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 154కు చేరుకుంది. సోమవారం ఉదయానికి దేశంలో కోవిడ్తో మరణించిన వారి సంఖ్య 4021కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.
భారత దేశంలో కరోనా వైరస్ సోకిన బాధితుల్లో ఇప్పటి వరకు 57,721 మంది కోలుకోగా మరో 77,103 మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది. ఈ నెల 12వ తేదీ వరకు 70 వేల పాజిటివ్ కేసులు ఉండగా ఆ సంఖ్య నేటికి లక్షా 38 వేలకు చేరింది. మహారాష్ట్రలో కోవిడ్ విశ్వరూపం చూపిస్తోంది. ఇప్పటి వరకు అక్కడ 50 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా మృతుల సంఖ్య 1635కి చేరింది. మహారాష్ట్ర తరువాతి స్థానంలో తమిళనాడు కొనసాగుతోంది.
అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 16,277 కి చేరుకోగా 111 మంది మత్యువాత పడ్డారు. ఇక మూడో స్థానంలో గుజరాత్ ఉంది. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 14,056 పాజిటివ్ కేసులు నమోదు కాగా 858 మంది మృత్యువాత పడ్డారు. దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే మొత్తం కేసుల సంఖ్య 13,418 చేరగా ఇప్పటి వరకు 261 మంది మృత్యువాత పడ్డారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు